Header Banner

నిజాన్ని నిర్భయంగా చెప్పడం ప్రకాశం పంతులు నైజం! ఆయన జీవితం నేటి తరానికి..

  Tue May 20, 2025 14:18        Politics

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం పంతులు సేవలను, ఆశయాలను ఈ సందర్భంగా లోకేశ్ స్మరించుకున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి విశేషమైన బాటలు వేశారని పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రకాశం పంతులు నిరంతరం శ్రమించారని కొనియాడారు. సమాజంలో జరిగే అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించడం, వాస్తవాలను నిర్భయంగా వెల్లడించడం టంగుటూరి ప్రకాశం పంతులు గారి సహజ లక్షణాలని లోకేశ్ కీర్తించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ, ఆంధ్ర రాష్ట్ర సాధనలోనూ ఆయన అత్యంత కీలకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రకాశం పంతులు గారి జీవితం, ఆయన ఆచరించిన విలువలు నేటి యువతరానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఆయన నిర్దేశించిన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting